మిగతా హీరోలతోనూ సినిమాలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు హీరో గోపీచంద్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా గ్లామర్ భామ రెజీనా నటిస్తోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ ప్రసాద్ చెప్పిన విశేషాలు..
పదిహేనేళ్ళ తరువాత
పదిహేనేళ్ల తరువాత దర్శకుడు రవికుమార్‌తో చేస్తున్న సినిమా ఇది. అలాగే గోపీచంద్, రవిల కాంబినేషన్‌కు 11 ఏళ్ళ గ్యాప్ వుంది. దర్శకుడిగా రవికుమార్ టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు. విజయాలు అపజయాల అనేవి పక్కనబెడితే టాలెంట్‌కే నేను గుర్తింపు ఇస్తాను. వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
తండ్రి మాటకోసం
ఈ కథ గురించి చెప్పాలంటే తండ్రి మాటకు విలువనిస్తూ అతని కుమారుడు ఏం చేశాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా వుంటుంది. ముఖ్యంగా తెలుగులో వున్న ప్రముఖ హాస్యనటులందరూ కనిపిస్తారు. చెప్పే విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పాం.
వినోదమే..
మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో వినోదం ప్రధానంగానే సాగుతాయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ వుంటేనే సినిమాకు వస్తున్నారు. రెండున్నర గంటలసేపు వారిని నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇటీవలే ఆడియో వేడుకను ఒంగోలులో చేశాం. సామాన్య ప్రేక్షకులకు దగ్గరగా వుండాలనే ఈ ప్రయత్నం. మా ప్రతి సినిమా ఆడియో కూడా అన్ని ఏరియాల్లో నిర్వహిస్తాం.
హైలెట్స్
సినిమాలో హైలెట్స్ చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏమిటనేదే సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇటీవలే విడుదలైన పాటలు కూడా మంచి హిట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఫొటోగ్రఫి, డైరెక్షన్, డైలాగ్స్ బావుంటాయి.
అందరితో చేస్తా
నేను నిర్మించిన సినిమాల్లో దాదాపు నాలుగు గోపీచంద్‌వే. వేరే హీరోలతో సినిమాలు తీయనని కాదు. అన్నీ కుదరాలి కదా. నేను వ్యాపారవేత్తగా ఉన్నాను కాబట్టి సినిమాను కూడా అనుకున్న ప్రకారంగానే విడుదల చేస్తున్నాం. అంతా ప్రణాళికా ప్రకారమే సాగుతుంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం శ్రీ్ధర్ సీపాన కథ అందించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభిస్తాం. దాంతోపాటు అతని దర్శకత్వంలో కూడా ఓ సినిమా వుంటుంది.

-శ్రీ