సెట్స్‌పైకి కడప కింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందే చిత్రం గతనెల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు దర్శకుడు మారాడు. ఇతర కారణాలవల్ల సూర్య ఈ సినిమానుండి తప్పుకోవడంతో ‘గోపాల గోపాల’ ఫేం డాలి లైన్‌లోకి వచ్చాడు. అయితే, స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగిపోతుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా గురించి యూనిట్ మాత్రం ఆగిపోలేదని ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయని, పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం తన ఫామ్‌హౌస్‌లోనే ఉన్నాడని, అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుపుతున్నట్టు తెలిపాడు. ఈ చిత్రానికి ‘కడప కింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ అధికారికంగా టైటిల్‌పై ఎలాంటి ప్రకటన విడుదలకాలేదు. మొత్తానికి పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.