ప్రేమ గొప్పదనే లవర్స్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిరెడ్డి, ఈషా అగర్వాల్, సుమిఘోష్, సిరి, ప్రియాంక ప్రధాన పాత్రల్లో రెడ్డి మల్టిప్లెక్స్ మూవీస్ సమర్పణలో మేడిన్ తెలంగాణ ఫిలిం బ్యానర్‌పై విజయ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే లవర్స్ పార్క్ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటి కవిత క్లాప్‌నివ్వగా, రచయిత ఘటికాచలం గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, ప్రేమ అనే పదానికి ఈ జనరేషన్‌లో విలువ లేకుండా పోయిందని, విలువ వున్న ప్రేమ ఎలా వుంటుందనే కానె్సప్టుతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తామని, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మినిమమ్ బడ్జెట్‌లో నిర్మిస్తున్నామన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యానర్‌ను స్థాపించామని, నలుగురు హీరోలు, హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటీనటులు కూడా వున్నారని, లవ్, రొమాంటిక్ స్టోరీ అయినా కూడా ఫ్యామిలీ అంతా చూసేలా వుంటుందని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా:ప్రవీణ్, ఎడిటింగ్:సోమేశ్వర్, దర్శకత్వం:విజయ్‌రెడ్డి.