వైజాగ్‌లో సునీల్ చిత్రం షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై సునీల్, మనార్‌ఛోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ వైజాగ్‌లో పూర్తిచేశారు. ప్రొడక్షన్ నెం.2గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు.
తదుపరి హైదరాబాద్‌లో షూటింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 35 రోజులపాటు వైజాగ్‌లో నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశామని, సునీల్, కబీర్, సత్యప్రకాష్, ఉదయ్‌ల కాంబినేషన్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైలెట్‌గా చేశామని, హీరోహీరోయిన్లపై ఓ పాట, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిపామని, సినిమాలో సప్తగిరి కామెడీ అందర్నీ నవ్విస్తుందని ఆయన తెలిపారు.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పేరును ప్రకటిస్తామని, దర్శకుడు సినిమాను ఊహించని మలుపులతో తెరకెక్కిస్తున్నారని ఆయన అన్నారు. సునీల్ కామెడీ టైమింగ్ మిస్‌కాకుండా ఈ చిత్రంలో యాక్షన్ చేశాడని, అనుకున్న విధంగానే వైజాగ్ షెడ్యూల్ పూర్తిచేశామని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. నాగినీడు, ఆనందరాజా, రాజారవీందర్, ఉదయ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దినేష్, కెమెరా: సి.రామ్‌ప్రసాద్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: ఆర్.సుదర్శన్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.