షార్ట్ ఫిలిం అవార్డుల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా అసోసియేషన్ నూతన కళాకారులు, కళారంగానికి మధ్య వారధిగా పనిచేస్తున్న సంస్థ- తెలుగు టాలెంట్. నూతన కళాకారులను ప్రోత్సహించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ ప్రభాత చిత్ర వారితో కలిసి సంయుక్తంగా ‘తెలుగు షార్ట్ ఫిలిం అవార్డు-2016’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నటుడు కాదంబరి కిరణ్ ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి షార్ట్ ఫిలిం అవార్డు పోటీలు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడతాయని, పరిశ్రమలోకి యువ టాలెంట్ వచ్చినపుడు పరిశ్రమ మరింత కళకళలాడుతుందని అన్నారు. పోటీల నిర్వాహకులు శశిధర్ వంశి మాట్లాడుతూ, వివిధ విభాగాల్లో ఈ షార్ట్ ఫిలిం అవార్డులను ప్రదానం చేస్తామని, ఉత్తమ, ద్వితీయ, తృతీయ విభాగాల్లో అవార్డులను అందజేస్తామని, ఆగస్టు నెలలో నిర్వహించే ఈ పోటీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, షార్ట్ ఫిలిం తీసినవారు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.