అమెరికాలో ‘చిత్రాంగద’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి టైటిల్ పాత్రలో ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ప్రస్తుతం అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేశారు. ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠకు గురిచేస్తుంది. అంజలి కెరీర్‌లో ఇలాంటి భిన్నమైన పాత్రను చేయలేదు. తెలుగుతోబాటు తమిళంలో కూడా విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ సినిమాలో అంజలి ఓ టైటిల్ సాంగ్ పాడింది. కొన్ని అదృశ్యశక్తుల కారణంగా ఆమె జీవితం ఎలాంటి చిక్కుల్లో పడింది, తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందనేదే చిత్రాంగద సినిమా. అమెరికాలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత వుండడంతో సినిమా ఆలస్యవౌతోంది. త్వరలోనే పాటలు విడుదలచేస్తాం’ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం:సెల్వగణేష్, స్వామినాధన్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, జేమ్స్ క్వాన్‌రోడిక్, సమర్పణ:టి.సి.ఎస్.రెడ్డి, వెంకట్ వాడపల్లి, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, దర్శకత్వం:అశోక్.జి.