చిరంజీవి గర్వపడేలా చేస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘లోఫర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విజయోత్సవ సభలో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ నిర్మాత కళ్యాణ్‌గారు చెప్పినట్టు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. మొదటి నుంచి ఈ సినిమా ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా వస్తున్నారని అన్నారు. ‘కంచె’, ‘ముకుంద’, ‘లోఫర్’ సినిమాలతో మూడు విభిన్న చిత్రాల్లో నటించి వరుణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, భవిష్యత్తులో చిరంజీవి, నాగబాబు గర్వపడే స్థాయికి ఎదుగుతాడని అన్నారు. నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ పూరి మరో మంచి సినిమా తీశారని, వరుణ్ నటించిన మూడు సినిమాల్లో హయ్యస్ట్ కలక్షన్స్ వసూలు చేసిన చిత్రం ఇదని అన్నారు. నైజాంలో 240 థియేటర్లలో విడుదల చేశామని, ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్ అందరూ ఆనందంగా వున్నారని అన్నారు.
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ సినిమా మీద వస్తున్న పలు రిపోర్ట్స్ వింటుంటే సంతోషంగా వుందని, ఈ సినిమా షూటింగ్‌లో అందరం కలసి ఓ ఫ్యామిలిలా చిత్రాన్ని చేశామని అన్నారు. ముఖ్యంగా మహిళలనుండి వస్తున్న ఆదరణ అద్భుతంగా వుందని, ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మంచి టీమ్ ఉంటే మంచి విజయం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందన్న నిజం ఈ చిత్రంతో మరోసారి తెలిసిందని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం చేయడం ఆనందాన్నిస్తోందని కథానాయిక దిశాపటానీ అన్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రాలోకేష్, ఉత్తేజ్, భద్రం, శాండి, ధన్‌రాజ్, టార్జాన్, చరణ్‌దీప్, వంశీ, రమ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కాశ్యప్, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాతలు: సి.వి.రావు, శే్వతలాన, వరుణ్‌తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.