ప్రయోగాలు చేయడం రిస్కే .. హీరో గోపీచంద్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. కేవలం రెండు గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారు ఎక్కువయ్యారు. అందుకే సినిమాలన్నీ ఆ బేస్‌లోనే వస్తున్నాయి’ అని అంటున్నాడు హీరో గోపీచంద్. ఆయన హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సౌఖ్యం’. రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా గోపీచంద్‌తో మాటామంతి..
* ఇంతకీ సౌఖ్యం ఎవరికి?
- సౌఖ్యం అనే పదం ఈమధ్య ఎక్కువగా వాడడం లేదు. ఈ కథ గురించి చెప్పాలంటే కొత్త కథ అని కాదు. కానీ కథ చెబుతున్న విధానం కొత్తగా వుంటుంది. రచయిత శ్రీ్ధర్ సీపాన మంచి కథ అందించాడు. మాస్ ఎంటర్‌టైనర్‌తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఉంటాయి.
* కేవలం ఎంటర్‌టైనర్‌నే నమ్ముకున్నారా?
- అలా అని కాదు. మంచి ప్రేమకథతోపాటు ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. దాన్ని సీరియస్‌గా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం.
* దర్శకుడు రవికుమార్ గురించి?
- రవితో నేను 11 సంవత్సరాలు తర్వాత చేస్తున్న సినిమా ఇది. అప్పట్లో ‘యజ్ఞం’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆయన స్టయిల్‌లోనే వుంటుంది.
* ఈమధ్య యాక్షన్‌ను వదిలేసినట్టున్నారు?
- ఎప్పుడూ ఒకే రకం సినిమాలు చేస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ఇప్పటివరకూ యాక్షన్ సినిమాల్లో చేసి ‘లౌక్యం’తో ట్రెండ్ మార్చాను. ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్‌నే. అందుకే వారికి నచ్చిందే ఇవ్వాలని ప్రయత్నం.
* హీరోయిన్ గురించి?
- రెజీనాతో ఇది మొదటి సినిమా. ఆమె నటించిన ‘పిల్లానువ్వులేని జీవితం’ సినిమా చూశాను. మంచి టాలెంట్ ఉన్న నటి. ఇందులో ఆమె పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఏదో హీరోయిన్ అంటే అలా వచ్చి పాటలకోసమే కాదు.
* మరి ప్రయోగాలు చేయరా?
- ప్రస్తుతం పరిస్థితి ప్రయోగాలు చేసేలా లేదు. ఒకవేళ మనం రిస్క్ చేసి ప్రయోగాలు చేస్తే ఆ సినిమాలకు డబ్బులు రాక నిర్మాతలు రోడ్డుపాలవుతారు. అది నాకిష్టం లేదు. మనం సినిమా చేస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఆనందంగా వుండాలి. ప్రయోగాలు చేసిన కమర్షియల్ ఫార్మాట్‌లో వుండాలి. కానీ అలాంటి కథలు దొరకాలికదా.
* ఈమధ్య హీరోలు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. మరి మీరు?
- ప్రొడక్షన్‌లో పాల్గొనడం అనే ఆలోచన లేదు. అది ఆ హీరోలకు, నిర్మాతలకు ఉన్న అండర్‌స్టాండింగ్‌ని బట్టి అలా ఉంటుంది.
* ఈ బ్యానర్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?
- ఇది నా హోమ్ బ్యానర్‌లాంటిది. ఆనంద్‌ప్రసాద్‌గారితో సినిమా చేయడం చాలా కంఫర్ట్‌గా వుంటుంది. ముఖ్యంగా మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగుండడంతో ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాను.
* దర్శకుడు జ్యోతికృష్ణతో చేయడానికి కారణం?
- జ్యోతికృష్ణ అప్పట్లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమా చేశారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ కథ చెప్పాడు నాకు. కథ బౌండ్ స్క్రిప్ట్‌తో తెచ్చాడు. కథ కొత్తగా ఉండి కమర్షియల్ అంశాలతో వుంటూనే ప్రయోగాత్మకంగా ఉంటుంది. టైటిల్ కూడా ‘ఆక్సిజన్’ అని ఆకట్టుకునే విధంగా వుంది.
* ఈమధ్య హీరోలు తమిళ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. మరి మీరు?
- నాకూ చేయాలని వుంది. కానీ అలాంటి అవకాశాలు ఇంకా రావడం లేదు. వస్తే చేస్తా.
* తదుపరి చిత్రాలు?
- బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. అది దాదాపు పూర్తికావచ్చింది. అలాగే జనవరి నుండి ‘ఆక్సిజన్’ షూటింగ్ ఉంటుంది.
* ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
- ప్రస్తుతం ట్రెండ్ ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. ఫ్యామిలీ ప్రేక్షకుల్ని థియేటర్‌వరకూ రప్పించడం చాలా కష్టమైంది. ఎందుకంటే టీవీల్లోనే వారికి కావల్సింది దొరుకుతుంది. దానికన్నా మించి మనం ఏదైనా ఇస్తేనే ప్రేక్షకులు థియేటర్ వరకూ వస్తున్నారు.

- శ్రీ