అనసూయ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జబర్దస్త్’ ఫేమ్ అనసూయ మరో సినిమాకి సన్నద్ధమవుతోంది. ఆ సినిమా సన్నాహాల్లో భాగంగానే ఇటీవల ఓ ఫొటోషూట్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో అనసూయ మరింత ఆకర్షణీయంగా కన్పిస్తోంది. చిట్టిపొట్టి దుస్తులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ చిత్రాల తర్వాత అనసూయకి హీరోయిన్‌గా బోలెడన్ని అవకాశాలొచ్చాయి. కానీ ఆమె తన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఆమె తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకి సంతకం చేసినట్టు సమాచారం. ఆ సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఓ కొత్త ఫొటోషూట్‌ని బయటపెట్టి అదరగొడుతోంది.