పవన్‌తో కుదరని శ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వస్తుందని యూనిట్ తెలిపింది. ‘కడప కింగ్’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు ముందు ఎస్.జె.సూర్య దర్శకుడిగా పూజా కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత ఆయన మహేష్ సినిమా కోసం ఈ సినిమాను వదిలేశాడు. ఇక ఆయన స్థానంలో దర్శకుడు డాలి చేరాడు. ఈ సినిమా హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తుందని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘గబ్బర్‌సింగ్’లో కలిసి నటించిన ఈ జోడి మళ్లీ ఈ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమానుండి శ్రుతి కూడా తప్పుకున్నట్టు సమాచారం. సినిమా మొదలు కాకపోవడం, ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంవల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిన శ్రుతి, ఈ సినిమా మొదలు కాకపోవడంతో తన డేట్స్ వృధా అవుతున్నాయంటోంది. దాంతో ఈ సినిమా మొదలయ్యేలోగా తనకు వేరే సినిమాల కమిట్‌మెంట్స్ ఉండడంవల్ల ఈ సినిమాకు నో చెప్పిందని సమాచారం?