అందరికీ నచ్చే శుభమస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 5న విడుదలకు సిద్ధమైంది. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎమోషన్ల విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో, కుటుంబమంటే పక్కివాడికి సంబంధించింది కాదని, మన కుటుంబానికి సంబంధించింది అనుకోవాలనే సందేశమిచ్చే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. శిరీష్, లావణ్య కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయని తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అందరినీ అలరించే సన్నివేశాలు ఉన్నాయని, ఇప్పటికే పాజిటివ్ ఎనర్జితో సినిమా యూనిట్ చిత్రాన్ని పూర్తిచేశారని, ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను కూడా త్వరలో విడుదల చేయనున్నామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.