కత్తిలాంటోడు కాదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తమిళ సూపర్ హిట్ ‘కత్తి’చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పెడతారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం లేదని నిర్మాత రామ్‌చరణ్ తెలిపాడు. ఈ టైటిల్ విషయంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు చిరంజీవి తన మెగా ఫ్యాన్స్‌ని షూటింగ్ లొకేషన్లో కలిసే ఏర్పాట్లు చేస్తున్నాడట. దీనివల్ల ఈ సినిమాకు ఇంకాస్త మంచి పబ్లిసిటీ రావొచ్చని, దాంతోపాటు తన అభిమానులను చాలాకాలం తరువాత కలుసుకోవాలని చిరంజీవి ప్రయత్నం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.