నాగచైతన్య కల్యాణం ఎవరితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య కల్యాణం సమంతతో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి...! ఇప్పుడు ఆ కల్యాణంలో మరో హీరోయిన్ పేరు విన్పిస్తోందని కంగారు పడాల్సిన పనిలేదులెండి. ఇక్కడ కల్యాణం అంటే.. నాగ చైతన్య పెళ్లి గురించి కాదు. ఆయన హీరోగా నటిస్తున్న ‘కల్యాణం’ సినిమా గురించి! ఇప్పటికే నాగచైతన్య, సమంతల ప్రేమాయణం మంచి జోరుమీదున్న విషయం తెలిసిందే. నిజానికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘కల్యాణం’ అనే టైటిల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదట సమంత నటిస్తుందని అనుకున్నారు, కానీ సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండడంవల్ల ఇప్పుడు ఈ సినిమాకు నో చెప్పడంతో.. మరో హీరోయిన్ ఓకే చెప్పింది! ఆమె ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న హాట్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్! ఇప్పటికే జోరుగా సినిమాలుచేస్తూ లేటెస్ట్‌గా మహేష్ సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయిన రకుల్ ఇప్పుడు నాగచైతన్య సినిమాకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో రకుల్ పాల్గొననుంది. అదీ విషయం!!