ఆది నటన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వెంకట్ తలారి, రాము తాళ్లూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ఆడియో సీడీ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలి సీడీని విడుదల చేసి, దర్శకుడు కొరటాల శివకు అందించారు. థియేటర్ ట్రైలర్‌ను హీరో సుధీర్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, ఆది డాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడని, ఒక హీరోనుండి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవన్నీ అతనిలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణాలో ప్రతిభ ఉన్న కళాకారులు చాలామంది ఉన్నారు కానీ వారికి ప్రోత్సాహం లేదని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని, తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యలనన్నిటిని ఒక్కక్కటి పరిష్కరించే దిశలో ఉందని తెలిపారు. చుట్టాలబ్బాయి ఆడియో వేడుక ఇంత ఘనంగా జరగటం సంతోషంగా వుందని, ఆది, సాయికుమార్ కలసి తొలిసారిగా ఈ చిత్రంలో నటించారని, ఒక మంచి చిత్రం తీశామని దర్శకుడు వీరభద్రమ్ అన్నారు. సినిమా అందరికీ నచ్చేలా రూపొందిందని, ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాతలు తెలిపారు. ఒక సంవత్సరం పాటు ఈ సినిమాకోసం తాము కష్టపడ్డామని, ఈ చిత్రంలో తన తండ్రితో కలిసి నటించడం సరికొత్త అనుభూతినిచ్చిందని హీరో ఆది తెలిపారు.