దగ్గుబాటి హీరోలతో మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి చేసిన ‘మనం’ సినిమా చూసినవాళ్ళు చాలామంది హీరోలకు.. అరే మనం కూడా ఇలాంటి ఫ్యామిలీ సినిమాచేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఇప్పటికే మెగా హీరోలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు నందమూరి హీరోలు కూడా ఇలాంటి సినిమా చేయాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మిగిలింది దగ్గుబాటి హీరోలు. ఇప్పటికే వెంకటేష్ స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలితో రానా పెద్ద స్టార్ అయ్యాడు. మరోవైపు నాగచైతన్య కూడా హీరోగా నిలబడ్డాడు. అందుకే దగ్గుబాటి హీరోలతో ‘మనం’లాంటి సినిమా చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు దర్శకులు ప్లాన్ చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఇటీవలే ‘క్షణం’ సినిమాతో గుర్తింపు తెచ్చకున్న రవికాంత్ పారేపు చెప్పిన కథ రానాకు బాగా నచ్చడంతో ఈ సినిమా ఫ్యామిలీ హీరోలతో చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వెంకటేష్, రానా, నాగచైతన్యలతోపాటు సురేష్‌బాబు కూడా నటిస్తాడని, సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మాణం కానున్న ఈ సినిమాలో రామానాయుడు కూడా కనిపిస్తాడట!! మరి ఈ దగ్గుబాటి హీరోల మనం ఎలా ఉంటుందో చూడాలి!!