శింబు భార్యగా శ్రీయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ భామ శ్రీయకు ఇప్పటికి ఆ చరిష్మా తగ్గలేదు. తనదైన గ్లామర్‌తో నేటి కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా హొయలు ఒలికించే శ్రీయకు ఈమధ్య హీరోయిన్‌గా డిమాండ్ తగ్గింది. దాంతో భార్య పాత్రల్లో నటించేందుకు రెడీ అయింది. ఇప్పటికే అడపా, దడపా భార్య పాత్రల్లో నటిస్తున్న ఈ భామ లేటెస్ట్‌గా ఓ సినిమాలో భార్య పాత్రలో నటించేందుకు ఫిక్స్ అయింది. పెద్ద హీరోల సినిమాల్లో భార్య పాత్రంటే పరవాలేదు కానీ, మరి కుర్ర హీరోల సినిమాల్లో కూడా భార్య పాత్ర అయితే.. ఎలా అని అందరూ శ్రీయ నిర్ణయానికి షాక్ అయ్యారు! ఇంతకీ శ్రీయ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుందో తెలుసా.. శింబు హీరోగా తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో ఈమె భార్య పాత్రలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమా 80వ దశకానికి సంబంధించిన కథతో ఉంటుందని సమాచారం. ఇందులో హీరో శింబు మూడు పాత్రల్లో నటిస్తున్నాడట. మధ్య వయసు హీరోకి భార్యగా శ్రీయ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి.. 1980లో పెళ్లి ఫొటో అని పోస్ట్ చేసింది. ఈ సినిమాకు ‘ఏఏఏ’ అనే టైటిల్ ఓకే చేశారట!! మరి ఈ సినిమా తరువాత శ్రీయకు అన్నీ ఇలాంటి పాత్రలే వస్తాయేమో చూడాలి!!