మరచిపోలేని ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య-369’ చిత్రం 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఎలాంటి గ్రాఫిక్ టెక్నాలజీ లేకున్నప్పటికీ అద్భుతమైన ప్రయోగంతో చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకులకి కొత్త అనుభూతి కలిగించారు. టైమ్‌మిషన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ప్రయాణించినట్లు చూపిన కథనం అబ్బురపరిచింది. ఈ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ తన అనుభవాల్ని పంచుకున్నారు. సైన్స్‌ఫిక్షన్ చరిత్రను, సెంటిమెంట్, ప్రేమ అన్ని రకాల అంశాల్ని కలగలిపిన కథతో తెరకెక్కించిన చిత్రమిది. ‘బ్యాక్‌టు ఫ్యూచర్’ అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అద్భుతంగా తెరకెక్కించారని, ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఆయన ప్రయోగాలు చేసి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారని అన్నారు. ఈ సినిమాకు బాలకృష్ణ సహకారం మరువలేనిదని, కథ విన్న ఆయన చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. తన జీవితంలో అలాంటి చిత్రాన్ని తెరకెక్కించినందుకు చాలా గర్వంగా వుందని అన్నారు. ఆ స్ఫూర్తితోనే మంచి చిత్రాల్ని నిర్మిస్తున్నామని, ఆమధ్య ‘ఆదిత్య-369’కు సీక్వెల్‌గా ఆదిత్య-999 చిత్రాన్ని చేద్దామని అనుకున్నా, అది వేరేవాళ్లు చేస్తుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని అన్నారు. ఇటీవలే నాని హీరోగా నిర్మించిన ‘జెంటిల్‌మన్’ చిత్రం మంచి విజయం సాధించిందని, చాలాకాలం తర్వాత మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నానని, త్వరలోనే మరో సినిమాతో మీ ముందుకు వస్తానని అన్నారు.