కోలుకుంటున్నా : కమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను ప్రమాదంలో పడ్డాను అనగానే నాపై అనేక మంది అభిమానం చూపించారు. నా ఆరోగ్యంకోసం దేవుణ్ణి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. త్వరలోనే కోలుకుని నడిచేస్తాను’ అంటూ కమల్‌హాసన్ వాయిస్ మెసేజ్‌ను తన అభిమానులకోసం పంపాడు. నటుడు కమల్‌హాసన్ మూడు రోజుల క్రితం తన కార్యాలయంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డ సంగతి తెలిసిందే. ‘కాలికి వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం నిలబడగలుగుతున్నా. అభిమానులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’ అని ఆయన మెసేజ్‌లో అన్నారు. ప్రస్తుతం కమల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్‌నాయుడు’ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ చిత్రంలో ఆయనతోపాటుగా శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటిస్తున్నారు.