శర్వానంద్ హిట్ కొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రా జా’ చిత్రం సూపర్‌హిట్ కావాలని హీరో ప్రభాస్ ఆకాంక్షించాడు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దర్శకుడు గాంధీ కథనంపై మంచి క్లారిటీ ఉన్న దర్శకుడని, సినిమా హిట్ అవ్వాలంటే దర్శకుడితోపాటు కథ కూడా ముఖ్యమేనని, అలా సాగే ఈ చిత్రంలో కలర్‌ఫుల్ చిలుక పాట అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత ఎలాంటి కథనంతో సినిమా చేయాలా అనుకుంటేనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయని, శర్వానంద్ కలిసి ఈ కథ చెప్పాక ఈ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చిందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారన్న నమ్మకం వుందని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు. ఈ సినిమాకు కథే హీరో అవడంతో తాను నటించానని, సినిమాలో ప్రతి పాత్రను ముఖ్యమైనదిగా తీర్చిదిద్దారని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని కథానాయకుడు శర్వానంద్ తెలిపారు. కార్యక్రమంలో దిల్‌రాజు, మారుతి, ప్రభాస్‌శ్రీను, సురభి, సత్య, వంశి, ప్రమోద్, సప్తగిరి, సుప్రీత్, హరీష్, ఉత్తమన్ తదితరులు పాల్గొన్నారు.