ఇదీ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైకు చెందిన ఓ డాన్ కథతో ఈ చిత్రం నడుస్తుంది. మలేసియా కేంద్రంగా అథోజగత్తును ఏలిన కబాలీశ్వరన్ అనే డాన్ కథకు చిన్నపాటి మార్పులు చేసి కబాలీగా రూపొందించారు. రజనీ తనయ సౌందర్యకూడా ఈ స్క్రిప్ట్‌వర్క్‌లో పాలుపంచుకుంది. 1960-80ల మధ్య కాలంలో దేశవిదేశాల్లో తన కార్యకలాపాలతో వణికించిన కబాలీశ్వరన్ జీవితకథతోకూడిన చిత్రం ఇది. యువకుడిగా, వయసు మీదపడినవాడిగా రెండు పాత్రల్లో రజనీ కన్పిస్తాడు. యువకుడిగా ఉన్నప్పుడు అతడి భార్య పాత్రను బాలీవుడ్ నటి రాధికా ఆప్టే పోషించింది. ఇక విలన్‌గా తైవాన్‌కు చెందిన హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ చావో నటించాడు. అతడి కుడిభుజంగా మలేసియా నటుడు రోసియం నటించగా తమిళనటులు దినేష్వ్రి, ధన్సిక మిగతా పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో కీలకపాత్రకు తెలుగు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు అవకాశం వచ్చినా, డేట్లు కుదరక నటించలేకపోయాడు. ఈ చిత్రంలో సహజత్వం కోసం దాదాపు 90శాతం షూటింగ్ మలేసియాలోనే చేశారు. కొన్ని సీన్లను హాంకాంగ్, థాయ్‌లాండ్‌లలో చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్‌ను వర్థన అనే తమిళ కళాకారిణి డిజైన్ చేసినప్పటికీ దుస్తుల మెటీరియల్, పరికరాలు, ఆయుధాలు అన్నీ మలేసియాలోనే కొనుగోలు చేశారు. ఒకటీ, అరా విదేశాలనుంచి తెప్పించుకున్నారు.