భయపెట్టే అత్తారిల్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాయి రవికుమార్, అతిథిదాస్ జంటగా అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. నిర్మాత, దర్శకుడు అంజన్ కె.కళ్యాణ్ మాట్లాడుతూ, అనేక హారర్ కుటుంబ కథా చిత్రాలకు పనిచేసిన తాను, స్వంతంగా ఈ కథ రాసుకున్నానని, మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా వుంటుందని తెలిపారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టే థ్రిల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామని అన్నారు. కథ కథనాల బలంముందు ఏదీ పనిచేయదని ఈమధ్య విడుదలవుతున్న సినిమాలు నిరూపిస్తున్నాయని, అదే నిజాన్ని మరోసారి అత్తారిల్లు నిరూపిస్తుందని ఆయన తెలిపారు. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నామని అన్నారు. నండూరి రాము, రాకేష్‌శర్మ, ఉదయ్ శరత్, జోజు, వినోద్‌కుమార్ ఎక్కా, రాజేంద్ర పులి, రాజశేఖర్, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివశంకర వరప్రసాద్, నేపథ్య సంగీతం: మణిశర్మ, కథ, స్క్రీన్‌ప్లే నిర్మాత, దర్శకత్వం: అంజన్ కె.కళ్యాణ్.