ప్రేమలోకంలో శే్వత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తబంగారులోకం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శే్వతబసుప్రసాద్ పెళ్లిపీటలెక్కబోతోంది. తొలి చిత్రంతోనే హిట్ హీరోయిన్‌గా పేరు పొందిన శే్వత, ఆ తర్వాత సరైన చిత్రాలను చేయలేకపోయింది. ఒకనొక సమయంలో వ్యభిచారం కేసులో ఇరుక్కుని కొన్నాళ్లు రెస్క్యూ హోంలో శిక్ష కూడా అనుభవించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక, టాలీవుడ్‌కు బై చెప్పింది. ముంబై వెళ్ళేప్పుడే షార్ట్ ఫిలిమ్స్ తీస్తానంటూ వెళ్లింది. అన్న పంతం నెగ్గించుకుంది. అక్కడ షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణ నేపథ్యంలో పరిచయం అయిన రోహిత్ మిట్టల్ అనే యువకుడి ప్రేమలో పడింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, శే్వత తన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. రోహిత్ తీసిన ‘ఆటో హెడ్’ అనే షార్ట్ ఫిలిమ్‌తో గుర్తింపు పొందాడు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు శే్వత చెబుతోంది.