తమన్నా ఐటమ్‌సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ‘కొరటాల శివ’ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. అనౌన్స్ చేసినప్పటినుండి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఇటీవలే రిలీజైన చిత్రం టీజర్ సుమారు 50 లక్షల వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేమంటే ఈ చిత్రంలో ఉన్న ఓ స్పెషల్ ఐటమ్‌సాంగ్‌లో స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడనుందట. ప్రీ క్లైమాక్స్‌కు ముందుగా వచ్చే ఈ సాంగ్ ప్రత్యేకంగా మాస్‌ఆడియన్స్ కోసమే రూపొందించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇకపోతే తమన్నా గతంలో కూడా ‘అల్లుడు శ్రీను’, ‘స్పీడున్నోడు’ వంటి చిత్రాల్లో ఐటమ్ పాటల్లో మెరిసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, నిత్యమీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.