సారధిలో తొలి కిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో టి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. జె.జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో క్రీస్తు కథనంతో వచ్చిన సినిమాలకన్నా ఇందులో కొత్త విషయాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, మూడో షెడ్యూల్ పూర్తికావస్తోందని అన్నారు. నాలుగో షెడ్యూల్‌ను వచ్చేనెల 2నుండి 15వరకు ఆర్.ఎఫ్.సి. జెరుసలెం, గోవా, ఇజ్రాయిల్ తదితర ప్రాంతా ల్లో షూటింగ్ చేయనున్నామని ఆయన అన్నారు.
సారధి స్టూడియోలోనే శిలువ సన్నివేశాలను, మూడు పాటలను చిత్రీకరిస్తున్నామని, గుడ్‌ఫ్రైడే సందర్భంగా చిత్రా న్ని మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత టి.సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో పి.డి.రాజు, సురేఖావాణి, సాయికిరణ్ పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.