అపార్ట్‌మెంట్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీక్రియేటివ్ ఫిలిమ్స్ పతాకంపై నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ మాట్లాడుతూ, ‘ఇదొక సస్పెన్స్‌తో కూడుకున్న మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. నిఖిత పాత్ర హైలైట్‌గా ఉంటుంది. ప్రధాన పాత్రల్లో సంజన, ఉత్తేజ్, చిన్నా వంటివారు నటించారు. ఖుద్దూస్ ఎస్.ఎ.స్వర పరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణకానున్నాయి. డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ చివరి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.’ అని తెలిపారు. నిఖిత, సంజన, చిన్నా, ఉత్తేజ్, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్ ఎస్.ఎ., కెమెరా: సాబూజేమ్స్, ఎడిటర్: నాగిరెడ్డి, ప్రొడ్యూసర్: ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ, కథ, దర్శకత్వం: శివగంగరాజు వుడిమూడి.

చిత్రం.. నిఖిత