త్వరలో ఆటాడుకుందాం...రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు,ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆటాడుకుందాం..రా’ (జస్ట్ చిల్). ఈ చిత్రం షూటింగ్ ముగిసిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ, ‘తాతగారి దేవదాసు చిత్రంలోని పాటను రీమిక్స్ చేయగా నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. ఈ పాట ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది’అన్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ‘తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో సెంటిమెంట్, ఎమోషన్‌తోపాటు అందర్నీ థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వున్నాయి’ అన్నారు. సుశాంత్, సోనమ్‌ప్రీత్, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: గౌంతరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, చీఫ్ కోడైరెక్టర్: డి.సాయికృష్ణ, కోడైరెక్టర్: కొండా ఉప్పల, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి, కథ, మాటలు: శ్రీ్ధర్ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.