అబ్బాయితో పుట్టినరోజు వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ ఆగస్టులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్న సాయికుమార్ తన జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ, ‘నేను, ఆది కలిసి నటించాలనుకుని మంచి కథ కోసం ఎదురుచూసిన సమయంలో ఈ అవకాశం వచ్చింది. మేమిద్దరం చేసిన తొలి చిత్రం ఇది. యూనిట్ సమక్షంలో నా 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందంగా వుంది.ఆదికి మంచి కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం వుంది’ అన్నారు. దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ, ‘సాయికుమార్ ఇందులో మంచి పాత్ర చేశాడు. తమన్ అందించిన సంగీతం అద్భుతంగా వుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా’అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమాను వీరభద్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఆది కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా ఉంటుంది. సాయికుమార్ విలక్షణ పాత్ర పోషించాడు’ అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ, ‘ఎప్పటినుంచో నేను, నాన్న కలిసి నటించాలనుకున్నాం. ఈ సినిమాతో అది నెరవేరింది. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తాం. నా కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చే చిత్రం ఇది అన్నారు.