తిక్క కోసం శింబు పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఓ హీరో కోసం మరో పాట పాడటం సాధారణమైంది. తమిళ హీరో ధనుష్ ఇటీవలే ఓ పాట పాడిన విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న తిక్క చిత్రం కోసం ధనుష్ ఓ పాట పాడాడు. ఇపుడు ఈ సినిమా కోసం మరో తమిళ హీరో కూడా గొంతు కలిపాడు. ఒకే చిత్రంలో ఇలా ఇద్దరూ తమిళ హీరోలు పాటలు పాడటం విశేషం. తమన్ సంగీత దర్శకత్వంలో ‘తిక్క తిక్క’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ని ధనుష్ పాడగా, ‘హీ ఈజ్ హాట్ షాట్’ అంటూ సాగే పాటను శింబు పాడాడు. ఈ సినిమాలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర వివరాలను నిర్మాత రోహన్‌రెడ్డి తెలియజేస్తూ,‘సాయిధరమ్ కెరీర్‌లో భారీ సినిమా ఇది. తమన్ అందిస్తున్న సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో ఇద్దరు తమిళ హీరోలు పాటలు పాడటం ఆనందంగా వుంది. ఈ పాటలను ఈనెల 30న విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 13న సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, ఎడిటింగ్:కార్తిక్ శ్రీనివాస్, కెమెరా:కె.వి.గుహన్, సహ నిర్మాత:కిరణ్ రంగినేని, నిర్మాత:సి.రోహన్‌రెడ్డి, దర్శకత్వం:సునీల్‌రెడ్డి.