శాటిలైట్‌లో గ్యారేజ్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా 60 కోట్లకుపైగానే జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈసినిమా శాటిలైట్ హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయట. రెండు సంచలన విజయాల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు 12.5 కోట్లకు ఓ ప్రముఖ ఛానెల్ తీసుకున్నట్టు సమాచారం. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా సమంత, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల 15న పాటలను విడుదల చేస్తారట.