త్వరలో ఇంకొక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో తమిళంలో రూపొందుతున్న ‘ఇరుమగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తెలుగు హక్కులను దక్కించుకుంది ఎన్.కె.ఆర్ ఫిలింస్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్, సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు నిర్మాత నీలం కృష్ణారెడ్డి తెలియజేస్తూ, ‘ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. చిత్రంలో నయనతార గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే హారిస్ జయరాజ్ అందించిన పాటల్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రాజశేఖర్, ఎడిటింగ్:్భవన్ శ్రీనివాస్, సంగీతం:హారిస్ జయరాజ్, నిర్మాత:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం:ఆనంద్ శంకర్.