మోక్షజ్ఞతో త్రివిక్రమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్. అ ఆ సినిమా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో సినిమా తీస్తాడనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ తాజాగా నితిన్‌తో ‘అ.. ఆ’ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీయాలి.. అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్‌కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఆ ఆఫర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిందని... అది బాలకృష్ణ కొడుకుకి సంబంధించిన విషయమని టాక్. నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం అయ్యే మూవీ.. త్రివిక్రమ్ చేతుల్లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ... బాలకృష్ణ 100వ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే నటనలో మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడని, మోక్షజ్ఞ తెరంగేట్రం చేసే సినిమా త్రివిక్రమ్ చేతిలో పడితే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞకి మంచి పేరొస్తుందని బాలకృష్ణ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.