5న నినే్న కోరుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక హీరో హీరోయిన్లుగా గణమురళి దర్శకత్వంలో శుభకరి క్రియేషన్స్ పతాకంపై మరిపి విద్యాసాగర్ నిర్మిస్తున్న చిత్రం ‘నినే్న కోరుకుంటా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత మరిపి విద్యాసాగర్ వివరాలు తెలియజేస్తూ, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రస్తుతం యువత ఎలా వుంది? వారి ఆలోచనలు, ఆశయాలు ఏమిటి? అని తెలియజెప్పే చిత్రమిది. ఈ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో దాదాపు వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా ప్రతిఒక్కరికీ నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ప్రణవ్, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:మరిపి విద్యాసాగర్, దర్శకత్వం:గణమురళి.