పాపం తమన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా డాన్సులకు అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తమన్నా తీసుకున్న పారితోషికం చాలా తక్కువేనట. ముందుగా ఈ చిత్రాన్ని తమిళంలోనే రూపొందించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, ఇందులోకి క్రేజీ వ్యక్తులు ఎంటర్ అవడంతో సినిమా భారీగా మారింది. అటువైపు ప్రభుదేవా, ఇటువైపు కోన వెంకట్‌లు నిర్మాతలుగా ఎంటర్ అవడంతో సినిమా మూడు భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయి. కానీ తమన్నాకు మాత్రం ముందు మాట్లాడుకున్న రెమ్యూనరేషనే ఇచ్చారట. నిజానికి ఇంత భారీ చిత్రమని తెలిస్తే, తమన్నా భారీగానే వసూలుచేసేదేమో. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతోందట. మొత్తానికి రెమ్యూనేషన్ విషయం పక్కనబెడితే, సినిమా హిట్ అయితే మాత్రం కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ దుమ్మురేపడం ఖాయం.