50 రోజుల జెంటిల్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సురభి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మన్’ చిత్రం ఇటీవలే విడుదలై అర్థశతదినోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం 28 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం పూర్తిచేసుకోవడం ఆనందంగా వుంది. నాని వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా వుండడంవల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. విడుదలైనప్పటినుంచీ సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా వుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని మంచి చిత్రాల్ని నిర్మిస్తానని తెలుపుతున్నాను. ముఖ్యంగా డేవిడ్ నాథన్ అందించిన కథ, మణిశర్మ సంగీతం, మోహనకృష్ణ దర్శకత్వ ప్రతిభ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి అన్నారు. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకోవడం చాలా ఆనందంగావుందని, 2008లో నానితో ‘అష్టాచమ్మ’ సినిమా చేశానని, ఆ తరువాత ఎనిమిదేళ్ళకు ఈ సినిమా చేస్తున్నానని, ఇన్ని రోజులు మంచి సినిమా కోసం వెయిట్ చేశానన్నారు. నాని సెలెక్టివ్‌గా కథలనెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడని, నివేదా థామస్ నటిగా పేరు తెచ్చుకుందని, ఇలాంటి కథలు కత్తిమీద సాములాంటివని చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డేవిడ్ నాథన్ పాల్గొన్నారు.