చందమామలాంటి టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా ధర్మరక్ష దర్శకత్వంలో ఐఇఎఫ్ కార్పొరేషన్ పతాకంపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ రావె’. ‘అది రాదు వీడు మారడు’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టైటిల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వుందని, చాలా రోజులుగా ధర్మరక్ష పేర్లను వింటున్నానని, ఇపుడు వీరిద్దరూ దర్శకులుగా చేస్తున్న తొలి సినిమా టీజర్ బాగుందని అన్నారు. నిర్మాతకు తొలి చిత్రమే అయినా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడని, నవీన్‌చంద్రకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి అన్నారు. దర్శకులు మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇదో డిఫరెంట్ సినిమా అని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. నిర్మాత కిరణ్ మాట్లాడుతూఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ, మంచి టీమ్‌తో పనిచేశానన్న అనుభూతి దక్కింది. తప్పకుండా సినిమా హిట్ అయి మా అందరికీ పేరు తేవాలని అన్నారు.