దూసుకుపోతున్న జక్కన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్‌పిఎ క్రియేషన్స్ పతాకంపై ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన జక్కన్న చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా భారీ ఓపెనింగ్స్ వసూళ్లు రాబట్టుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడిగా ఇది తనకు రెండవ చిత్రం. జక్కన్న టైటిల్ ప్రేక్షకుల్లో బాగా పాపులరైందని, ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఆనందంగా వుంది అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ, ఈ విజయం తన ఒక్కడివల్ల వచ్చింది కాదని, రాంప్రసాద్ సినిమా చూసి చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా అందరం చాలా కష్టపడ్డామని, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారని, ముఖ్యంగా డైలాగులకు బాగా పేరొచ్చిందన్నారు. హీరోయిన్ మన్నారా చోప్రా సహకారం మరువలేనిదని, మేమందరం కలిసి పదిమందిని నవ్విద్దామనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది అన్నారు. నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లో 15 కోట్లు వసూలు చేసిందని, దినేష్ సంగీతం, భవానీప్రసాద్ మాటలు హైలెట్‌గా నిలిచాయి. సప్తగిరి కామెడీ సినిమాకు ప్లస్ అయింది అన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.