లక్ష్మీబాంబ్ నాకు మైలురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న లక్ష్మి బాంబ్ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తికావచ్చిందని, కామెడీ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలసిన సినిమా ఇదని, రెండు పాటలు రెండు ఫైట్స్ వుంటాయని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఈనెల 15తో టాకీ పూర్తిచేసి త్వరలోనే పాటలని విడుదల చేస్తామని, దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. గుణపాటి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, మంచు లక్ష్మి సహకారంతో సినిమా బాగా వస్తోందని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ, సినిమా చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా వుందని, ముఖ్యంగా ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నానని, ఇలాంటి పాత్రను ఇప్పటివరకూ చేయలేదని, పాటలు, ఫైట్లు బాగా వచ్చాయని, తప్పకుండా తన కెరీర్‌కు మంచి మైలేజ్‌నిచ్చే చిత్రమిదని అన్నారు.నిర్మాతలు మాట్లాడుతూ, షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందని, మంచు లక్ష్మిని ఇంతవరకూ ఎవరూ చూడని పాత్రలో చూస్తారని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:జోషి మలహర్‌భట్, నిర్మాతలు:వేళ్ల వౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ, దర్శకత్వం:కార్తికేయ గోపాలకృష్ణ.