ఇందిరమ్మ కోసం 18 కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా ఎక్కువయింది. ముఖ్యంగా ఇలాంటి.. సినిమాలు బాక్స్‌ఆఫీస్‌వద్ద దుమ్మురేపుతున్నాయి. అందులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌తో ఇప్పుడు చాలామంది ఈ తరహా సినిమాలు తీయడానికి సిద్ధంఅయ్యారు. లేటెస్ట్‌గా ఓ సినిమాకోసం హాట్‌భామ విద్యాబాలన్ ఏకంగా 18 కోట్లు అడిగిందట!! ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు! నిజంగా బాలీవుడ్‌లో ఇది రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటికే ‘బాజీరావు మస్తానీ’ సినిమాకు గ్లామర్ భామ దీపికాపదుకోనె 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తరువాత మరో సినిమాకు ఆమె ఏకంగా 12 కోట్లు డిమండ్ చేసిందట! అప్పటికి అదే రికార్డ్. ఈ లెక్కన విద్యాబాలన్ రెమ్యునరేషన్ సంచలనంగా మారింది.. ఇంతకీ ఆమె ఏ సినిమాకోసం ఇంత మొత్తం అడిగిందో తెలుసా.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథతో తెరకెక్కే సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి రానుంది.