పాటల ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని అఖిల్ ఆడియోను, ట్రైలర్‌ను హీరో సుమంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ, ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, బ్రహ్మానందం ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. అనూప్ అందించిన సంగీతం అందరికీ నచ్చుతుందని, శ్రీ్ధర్ శీపాన కథ చెప్పినపుడు ఎంతగానో నచ్చిందో అంతకన్నా బాగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారని, తనను చూసి ప్రేక్షకులు గర్వపడేలా ఈ సినిమా వుంటుందని తెలిపారు. నాగచైతన్య స్పెషల్ అప్పియరెన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటుందని, అఖిల్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడని ఆయన అన్నారు. ఇది పూర్తిగా టెక్నీషియన్ల చిత్రమని, అనూప్ పాటలు, కెమెరామెన్ శివ పనితనం ఈ సినిమాకు రిచ్‌గా ఉంటాయని, టైమ్‌మిషన్ సెట్ అందరికీ నచ్చుతుందని, ఖచ్చితంగా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈసారి తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తున్నామని, అనూప్ రూబెన్స్ పాటలు, బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటాయని, ఓ మంచి టీమ్‌తో ఆటాడుకుందాం రా చిత్రాన్ని నిర్మించామని నిర్మాత ఎ.నాగసుశీల అన్నారు. ఫస్ట్ కాపీ సిద్ధమైందని, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపు తున్నామని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు తెలిపారు. అఖిల్ తొలి చిత్రంలోనే ఆటాడుకుందాం రా పాటతో సుశాంత్ ఈ సినిమా చేయడం, ఈ సినిమాకు అఖిల్ వచ్చి ఆడియో విడుదల చేయడం, అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు చిత్రంలోని పల్లెకు పోదాం పారును చూద్దాం పాట రీమిక్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని నిర్మాత బి.ఎ.రాజు తెలిపారు.