భేతాళుడుగా విజయ్ ఆంటోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిచ్చగాడుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని మరోసారి భేతాళుడుగా రానున్నాడు. తమిళంలో రూపొందించిన సైతాన్ చిత్రాన్ని తెలుగులో భేతాళుడుగా అనువదించారు. మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈనెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార దృశ్యాలను, ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గారూపొందిన ఈ చిత్రం తన గత చిత్రాలకన్నా భిన్నంగా ఉంటుందని, ఫొటోగ్రఫి ఈ సినిమాకు హైలెట్ అని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. తన సినిమాపై అంచనాలు ఈ చిత్రం మరోసారి అందుకుంటుందని, తెలుగు నాట నటుడిగా మరింత గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. అరుంధతి నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా:ప్రదీప్ కలిపురయత్, ఎడిటింగ్:వీరసెంథిల్, సంగీతం:విజయ్ ఆంటోని, నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్, కె.రోహిత్, సమర్పణ:ఎం.శివకుమార్, దర్శకత్వం:ప్రదీప్‌కుమార్.