శివకుమార్‌కు సింగం-3 తెలుగు హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సింగం-2 కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు దానికి మూడో సీక్వెల్‌గా సింగం-3 రూపొందుతోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను భారీ పోటీ మధ్య సుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సొంతం చేసుకుంది. నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ హక్కులు తీసుకున్న సందర్భంగా వివరాలు తెలియజేస్తూ, మొదటినుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే భావనతో సినిమాలు తీస్తున్నామని, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో ప్రస్థానం ప్రారంభించామని, ఇటీవలే ‘శౌర్య’ చిత్రాన్ని నిర్మించానని, తాజాగా ‘సింగం-3’ తెలుగు హక్కులు దక్కించుకోవడం ఆనందంగా వుందని అన్నారు. సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నామని, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమా వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగడం విశేషం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్నారు. అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిష్ జైరాజ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, దర్శకత్వం: హరి.