మనోజ్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్ కథానాయకుడుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.ఎస్.సత్య దర్శకత్వంలో వరుణ్ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం నేడు సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. మంచు లక్ష్మి క్లాప్ ఇవ్వగా మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్య కె.ఎస్. మాట్లాడుతూ యాక్షన్ లవ్ స్టోరీ జోనర్‌లో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. హీరో, విలన్ల పాత్రలు ఈ సినిమాలో కొత్తగా ఉంటాయని, యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు హైలెట్‌గా చిత్రీకరించనున్నామని ఆయన అన్నారు. ఈనెల 17 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సినిమా పూర్తయ్యేవరకు ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతామని, డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత వరుణ్ అట్లూరి తెలిపారు. రాజేంద్రప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, రావురమేష్, ప్రవీణ్, షకలక శంకర్, సత్య, జెమినీ సురేష్, కాశీవిశ్వనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.జె.శ్రీవసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, నిర్మాత: వరుణ్ అట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కె.ఎస్.సత్య.