ప్రేక్షకులు శుభమస్తు అన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సోలో’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేశారు. తాజాగా అల్లు శిరీష్, లావణ్యాత్రిపాఠి జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మరోసారి ముందుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న సందర్భంగా దర్శకుడు పరశురామ్ చెప్పిన విశేషాలు.
మంచి స్పందన..
ఈ సినిమాకు రెస్పాన్స్ బాగా వచ్చింది. ముఖ్యంగా నేను ఊహించిన దానికన్నా ఎక్కువే రావడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మారిపోయాయి. చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కే కాకుండా అందరికీ నచ్చుతోంది.
కొంచెం కష్టమే..
నిజానికి ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం కష్టమే అని చెప్పాలి. ఎక్కడ చిన్న తప్పుచేసినా కూడా అది సినిమాకే దెబ్బ. ముఖ్యంగా ఇలాంటి ప్రయత్నాలు హిట్టయితే హ్యాపీ. అదే డిస్ట్రర్బ్ అయ్యిందనుకోండి ముందు ముందు ఇలాంటివి చేయాలంటే భయం వేస్తుంది.
పోలిక మంచిదే..
ఈ సినిమా చూసిన చాలామంది డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు. ప్రత్యేకంగా డైలాగులు రాయలేదు. కథలోనుంచి పుట్టినవే. అలాగే నేను చేసిన సోలో, బొమ్మరిల్లు చిత్రాలతో పోలుస్తున్నారని తెలిసింది. అలా పోల్చడం మంచి విషయమే. ఎందుకంటే ఇది కూడా అలాంటి మంచి ఫ్యామిలీ సినిమా అని వారి ఫీలింగ్ కదా.
శిరీష్ ఎఫర్ట్ ఎక్కువ..
ఈ సినిమాకోసం అల్లు శిరీష్ తీసుకున్న ఎఫర్టే ఎక్కువ. నాకన్నా కూడా చాలా కష్టపడ్డాడు. నేను రాయడానికి, తీయడానికి కష్టపడ్డానేమో గానీ తెరమీద మొత్తం చేసింది తనే.
తనకోసమే..
ఈ కథను తనకోసమే రాసుకున్నాను. ఓ సందర్భంలో కలిసినప్పుడు శిరీష్ నాతో సినిమా చేద్దామని చెప్పాడు. నేను చేసిన సోలో సినిమా బాగా నచ్చిందట. ఆయన అడగడంతో నాకు కూడా చేయాలని అనిపించింది. అలా అతనికోసమే ఈ కథను రాశా. నేను చెప్పిన కథ తనకు నచ్చింది. అలాగే ఆడియన్స్ కూడా 10 నిమిషాల్లోనే కనెక్ట్ అవుతున్నారు.
లావణ్య మంచి ఆర్టిస్ట్..
హీరోయిన్ లావణ్యాత్రిపాఠి అద్భుతంగా నటించింది. ముఖ్యంగా మధ్యతరగతి అమ్మాయి పాత్రలో జీవించింది. అలాగే శిరీష్, లావణ్యల కెమిస్ట్రీ బాగా కుదిరింది. దాంతోపాటు ప్రకాష్‌రాజ్, రావురమేష్‌ల నటన సినిమాకే హైలెట్. ముఖ్యంగా అల్లు అరవింద్ బ్యానర్‌లో సినిమా రావడం గొప్ప విషయం. ఆయన ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ అందించారు.
తదుపరి చిత్రాలు..
ఈ సినిమా తర్వాత మళ్లీ ఇదే బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. హీరో ఎవరనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

- శ్రీ