క్రేజీ మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నందమూరి హీరోలకు, మెగా హీరోలకు మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నా, అవి అక్కడే ఆగిపోయాయి. తాజాగా కల్యాణ్‌రామ్, సాయిధరమ్‌తేజ్‌లతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఓ దర్శకుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే కల్యాణ్‌రామ్ కథ కూడా విన్నాడని తెలిసింది. ఈ చిత్రంలో మరో హీరోకోసం అడగ్గా ఆయన సాయిధరమ్ పేరు సూచించారట. ఇప్పటికే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. మరి ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమా నిజంగా సంచలనమే అని చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారు.