ఈ 30 ఏళ్లు ఓ జ్ఞాపకంగా భావిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాలు చేస్తూ, ‘విక్టరీ’ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు నటుడు వెంకటేష్. ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ హీరోగా సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఆగస్టు 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వెంకటేష్ చెప్పిన విశేషాలు..
అందుకే ఆ డైలాగ్ వాడాం..
బొబ్బిలిరాజా సినిమాలో ‘అయ్యో అయ్యో..’ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమా చూడని ఇప్పటి జనరేషన్ కూడా ఈ సినిమాలో ఆ డైలాగ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ‘బొబ్బిలిరాజా’కు సంబంధించిన ఆ పాపులర్ పదాన్ని ఎక్కడో ఒక ప్లేస్‌లో ఉపయోగించాలని దర్శకుడు మారుతి భావించాడు. సినిమాలో నా క్యారెక్టర్ ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫీలయ్యే క్యారెక్టర్ కాబట్టి యాక్షన్ సీన్‌లో సారీ సార్.. అనే ప్లేస్‌లో ఈ డైలాగ్‌ను ఉపయోగించాం. అలాగని ఈ డైలాగ్ సినిమా అంతటా ఉండదు.
గ్యాప్‌కు కారణం ఏమీ లేదు..
గ్యాప్ వచ్చిన మాట నిజమే కానీ ప్రత్యేకంగా కారణం ఏమీ లేదు. చాలా కథలు వింటూ వచ్చాను. ఇంతకుముందే మారుతితో సినిమా చేయాల్సింది కానీ వీలుపడలేదు. మారుతి నా క్యారెక్టర్ గురించి చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. నా క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ను చూస్తారు. సింపుల్ ఎంటర్‌టైనింగ్ ఫార్మెట్‌లో వుండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్రతి క్యారెక్టర్‌ను మనం చేయాలనుకోకూడదు. వయసుకు తగిన క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ పోవాలి. నేను డైరెక్ట్ సినిమాలనే కాకుండా రీమేక్ సినిమాను కూడా చేయాలనుకుంటాను.
మారుతితో మళ్లీ..
మారుతితో ‘రాధా’ అనే సినిమా చేయాలి. అది కొన్ని కారణాలతో ఆగిపోయింది. అయితే మారుతి నాతో చేయడానికి చాలా ఆసక్తిగా ఉండటాన్ని గమనించాను. సాధారణంగా నేను ప్రతి టెక్నిషియన్‌లో ఆ విషయాన్ని గమనించాను. మంచి కథ చెప్పాడు కాబట్టి మారుతితో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అతను ఎక్కడా కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటాడు. గతంలో కోడి రామకృష్ణ కూడా అలానే ఉండేవారు.
నయనతార కథకు యాప్ట్..
నయనతార ప్రమోషన్‌కు రానని ముందే చెప్పేసింది. తనయితే ఈ సినిమా కథకు యాప్ట్ అవుతుందని తీసుకున్నాం. ఇక సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్యలుంటాయి. దానికి తగ్గట్టు వెతుక్కోవాలి, తప్పదు. అయితే అన్నింటికంటే మంచి స్క్రిప్ట్ దొరకాలనుకుంటాను. నటుడిగా 30 ఏళ్ళు పూర్తిచేసుకోవడం అనేది నాకు తెలిసి అదో పెద్ద విషయం కాదు. అదొక జ్ఞాపకం అనుకుంటాను. దీనికి కారణం ప్రేక్షకులు. వారు తొలి సినిమా నుంచీ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నేను సినిమాల్లోకి రావాలని లేదు. ప్రతిఒక్కరూ వారిని ఎక్కడో ఒకచోట డిస్కవర్ చేసుకుంటారు. అలా నేను సినిమాల్లో ఎంటర్ కావడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. నా పిల్లలకు కూడా వారికి ఇష్టమైనదే చేయాలని చెప్పాను. మా అబ్బాయి అర్జున్ తనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలనుకునే రకం.
హర్రర్ జానర్లో సినిమా..
రాజుగారి గది సీక్వెల్ కాదు కానీ, అలాంటి స్టోరీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ హర్రర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కదా. అందునే కొత్తగా చేద్దామని. అయినా వచ్చిన సినిమాకు రీమేక్‌లు చేయడం ఎందుకు, నా సినిమాల్లో అయితే నువ్వు నాకు నచ్చావ్ చేస్తే బావుంటుంది. అలాగే దృశ్యం కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని దర్శకులను అడిగితే బాగుంటుంది.
తదుపరి చిత్రాలు..
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు.. మీకు జోహార్లు’ అనే చిత్రంతో పాటు, బాలీవుడ్ మూవీ ‘సాలా ఖుద్దూస్’ రీమేక్‌లో నటిస్తున్నాను.

-శ్రీ