21 సెంచరీ లవ్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా గోపీనాధ్ దర్శకత్వంలో పి.నరేందర్ రూపొందించిన ‘21 సెంచరీ లవ్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవలే చిత్రానికి సంబంధించిన పాటలను విడుదల చేశామని, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో అనూహ్యమైన స్పందన లభిస్తోందని తెలిపారు. నేటి యువత స్నేహం కోసం బ్రతకాలా? ప్రేమకోసం బ్రతకాలా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ రెండింటిమధ్య వున్నది ఆకర్షణా అన్నది కూడా తేల్చుకోలేకపోతున్నారని, కెరీర్‌పై దృష్టి పెట్టకుండా పక్కదారి పడుతున్నారని, వాళ్ళలో వున్న అనుమానాలు దూరం చేయడానికి ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. స్నేహం, ప్రేమ అన్న రెండు అంశాలపై రూపొందించిన ఈ చిత్రంపై ఓ పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు. స్నేహం, ప్రేమ, ఆకర్షణ అనే మూడు పదాలకు మీకు నచ్చిన నిర్వచనం చెప్పి పంపిస్తే ప్లాటినమ్ డిస్క్ వేడుకలో బహుమతి అందజేస్తామని తెలిపారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.