శర్వానంద్, దిల్‌రాజుల శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా దిల్‌రాజుకు, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలకు ఒక గుర్తింపు వుంది. ఈ సంస్థ నుండి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ బొమ్మరిల్లు చిత్రానికి ఉన్న ప్రత్యేకత వేరు. ‘బొమ్మరిల్లు విడుదల అయి నేటికి సరిగ్గా పది సంవత్సరాలలు అవుతోంది. తండ్రీ కొడుకుల మధ్య వుండే సంబంధాన్ని అందంగా ప్రతిబింబించిన చిత్రం బొమ్మరిల్లు. ఇప్పుడు సరిగ్గా అదే రోజున, తాతా మనవళ్ళ మధ్య ఉండే బంధాన్ని చూపే ‘శతమానం భవతి’ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. బొమ్మరిల్లు లాగే శతమానం భవతి చిత్రం మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుంది. శర్వానంద్, అనుపమా పరమేశ్వర్ హీరో, హీరోయిన్లుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం’ అని దిల్‌రాజు తెలిపారు.
ప్రకాష్‌రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మధు, సినిమాటోగ్రఫి:సమీర్‌రెడ్డి, సంగీతం:మిక్కీ జె మేయర్, ఇతర తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.