నాని లోకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘నేను లోకల్’ (ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్). శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కేరెక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీగా రూపొందించిన ఈ చిత్రం ఆర్య చిత్రాల స్థాయిలో వుంటుందని, ఈనెల 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం చివరి భాగంలో విడుదల చేసే విధంగా సన్నాహాలు జరుపుతున్నామన్నారు. తాను నటించిన ఓ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకుందని, ఒకటి విడుదలకు సిద్ధమవుతోందని, ఇవాళ మరో చిత్రం ప్రారంభమైందని నాని తెలిపారు. కథలు వింటూనే తాను ఎంజాయ్ చేస్తానని, దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. హీరో నాని పాత్ర సరికొత్తగా వుంటుందని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నిర్మాత అన్నారు. కార్యక్రమంలో అరవింద్, శ్యాంప్రసాద్, జెమిని కిరణ్, రవికిశోర్, దానయ్య, దాము, ఠాగూర్ మధు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కెమెరా:నిజార్ షఫి, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:ప్రసన్నకుమార్, దర్శకత్వం:త్రినాథరావు నక్కిన.