మలయాళంలోకి రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలుగు హీరోలు ఇతర భాషల్లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్‌బాబు, చరణ్‌లు స్పీడ్ పెంచారు. ఈసారి వారిద్దరితోపాటు మరో టాలీవుడ్ హీరో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న భల్లాల దేవుడు.. అదే రానా ఇప్పుడు హీరోగా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాహుబలి డబ్బింగ్ సినిమాతో అక్కడ కూడా ఇమేజ్ తెచ్చుకున్న రానా ఇపుడు మలయాళంలో రూపొందే ఓ సినిమాలో హీరోగా ఎంపికయ్యాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడట. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహిస్తాడని, మలయాళంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుందట. ఈ సినిమా 1971 యుద్ధ నేపథ్యంలో సాగే కథతో ఉంటుందని, ఇందులో రానా ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.