కమెడియన్‌కు జోడీగా రెజీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ రెజీనాకు ఈమధ్య కాస్త బ్రేక్ పడింది. వరుస పరాజయాలతో కెరీర్ వెనకపడింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గిపోవడంతో ఇప్పుడు తమిళంలో గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్న ఈ భామకు ఓ మంచి ఛాన్స్ దక్కింది. అయితే తమిళంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది కమెడియన్ సరసన కావడం విశేషం. తమిళ కమెడియన్ సంతానం హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే హర్రర్ ఎంటర్‌టైనర్‌లో రెజీనా హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. మరో హీరోయిన్‌గా నందిత శే్వతాను ఎంపిక చేశారు. వచ్చేనెలలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమాతో తమిళంలో ఎలాంటి క్రేజ్ దక్కించుకుంటుందో చూడాలి.